అప్పుల బాధతో డోలు విద్వాంసుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణంలోని బీపీ అగ్రహారానికి చెందిన డోలు విద్వాంసుడు వెంకటరమణ లాక్డౌన్ ప్రభావంతో పని లేకపోవడం... రెండు నెలలుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికితోడు అప్పులిచ్చిన వారు ఒత్తిడి తేవడం వల్ల మనస్థాపానికి గురై విషద్రావకం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేకనే వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి..