చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాలసముద్రం మండలం టీవీఎన్ఆర్పురానికి చెందిన సుబ్రహ్మణ్యం రాజు (45) జేసీబీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన సోమవారం ఓ మహిళను వెంటబెట్టుకుని పట్టణంలోని ఎల్బీఎస్ రోడ్డులోగల ఓ లాడ్జికి వచ్చి గదిని అద్దెకు తీసుకున్నాడు. కొంత సేపటికి ఆ మహిళ వెళ్లిపోయింది. తరువాత ఎంతసేపటికి సుబ్రహ్మణ్యం రాజు గది తలుపులు తీయకపోవటంతో.. అనుమానం వచ్చిన నిర్వాహకులు రాత్రి గడియను తొలగించారు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వటంతో.. వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే నోటి నుంచి నురగలు వస్తుండటంతో.. పురుగుల మందు తాగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గసగసాల కేసులో మరో ఇద్దరి అరెస్టు