ETV Bharat / state

ధారలు కట్టిన రక్తం మాటున... మాంసం ముద్దలు - accidents in ap

చుట్టాన్ని కోల్పోయిన దుఖం నుంచి తేరుకోకముందే... ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కంటైనర్ రూపంలో కాటేసింది. అంత్యక్రియలు ముగించికొని సొంతూరికి చేరకుండానే... వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై మొగిలి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం... 10 మందిని పొట్టనబెట్టుకుంది. సమీప బంధువులు 8 మంది మృతిచెందారు. మృతుల్లో 8 మంది మర్రిమాకులపల్లె గ్రామానికి చెందిన వారే.

ధారలు కట్టిన రక్తం మాటున... మాంసం ముద్దలు
author img

By

Published : Nov 9, 2019, 6:37 AM IST

ధారలు కట్టిన రక్తం మాటున... మాంసం ముద్దలు

కటిక చీకటి... మృతుడు ఎవరో... క్షతగాత్రుడు ఎవరో గుర్తించలేని దీనస్థితి. ధారలు కట్టిన రక్తం మాటున.... మాంసం ముద్దల నడుమ కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను వెతుక్కొంటూ... అయినవారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా ఘోషించింది. ప్రమాదం జరిగి 4 గంటలు గడచినా... మృతులు ఎందరో గుర్తించలేనంత విషాద సంఘటన అది. బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై బంగారుపాళెం మండలం మొగిలి కనుమ రహదారిలో జరిగిన ప్రమాదం... ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. బంధువు అంత్యక్రియలను ముగించుకొని... మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన ఆ కుటుంబం... కాటికి చేరాల్సి వచ్చింది.

ఓ కంటైనర్... గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డిశేఖర్‌ కుటుంబంలో చీకట్లను నింపింది. తవనంపల్లె మండలం తెట్టుగుంట్లపల్లెలో అకాలమరణం చెందిన తమ బంధువు అంత్యక్రియలకు... రెడ్డిశేఖర్‌ కుటుంబం 2 వాహనాల్లో వెళ్లింది. బంధువును కడసారి చూసి తిరిగి మర్రిమాకులపల్లెకు బయలుదేరారు. ఆకస్మికంగా మృత్యుపాలైన బంధువు... వారి పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకొంటూ... సాగిన ఆ కుటుంబ ప్రయాణం... మొగిలి కనుమ రహదారిలో కడతేరింది. మృత్యురూపంలో వచ్చిన కంటైనర్‌ 8 మందిని కబళించింది. బ్రేకులు పడక... దూసుకొచ్చిన కంటైనర్‌ కిందపడి రెడ్డిశేఖర్‌ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జైంది.

రెడ్డిశేఖర్‌, ఇతరులు ఒక వాహనంలో... ఆయన భార్య, మరదలు, అత్తతో పాటు మరో ఐదుగురు ఇంకో వాహనంలో మర్రిమాకులపల్లెకు బయలుదేరారు. రెడ్డిశేఖర్‌ వాహనం ఇంటికి చేరుకొన్నా... మరో వాహనం రాకపోయేసరికి సమాచారం కోసం ఫోన్‌ ద్వారా ప్రయత్నించారు. ఫోన్‌లు పనిచేయలేదు. మొగిలి కనుమ రహదారిలో ప్రమాదం జరిగిందని తెలిసింది. తమవారు ప్రమాదంలో ఉన్నారేమోనన్న అనుమానంతో ప్రమాదస్థలానికి చేరుకున్నారు. భార్య, మరదలు, మామతో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసుకొని... గుండెలవిసేలా రోధించారు.

ఈ ప్రమాదంలో రెడ్డిశేఖర్‌ కుటుంబ సభ్యులతో పాటు... ద్విచక్రవాహనంపై వెళ్తున్న బంగారుపాళెం మండలం బలిజపల్లెకు చెందిన నరేంద్రశెట్టి ప్రాణం కోల్పోయారు. ఘటనా స్థలాన్ని చిత్తూరు కలెక్టర్‌ భరత్‌నారాయన గుప్తా, పూతలపట్టు శాసనసభ్యుడు ఎం.ఎస్‌.బాబు పరిశీలించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.50 వేలు ఆర్థికసాయం ప్రకటించారు. ప్రమాదం జరిగిన తీరు భయానకంగా ఉంది. మృతుల సంఖ్యను పోలీసులు సరిగా అంచనావేయలేకపోయారు. తొలుత 12 మంది ప్రాణాలు కోల్పోయారని... మృతుల్లో డ్రైవర్‌ ఉన్నట్లు పోలీసులు భావించారు. ఈ దుర్ఘటనకు కారణమైన కంటైనర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండీ... ప్రధాని మోదీ ఆలోచనను సమర్థిస్తున్నాం: చంద్రబాబు

Intro:Body:

tdp round table

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.