ఇంటి ముంగిట నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం డీఎం పురంలో కలకలం రేపింది. మృతుడు చిరంజీవి (37)... లారీ డ్రైవర్ గా పని చేసేవాడు. లాక్డౌన్ కారణంగా చిరంజీవి ఇంటి వద్దనే ఉన్నాడు.
శుక్రవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న అతడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన చిరంజీవిని కుటుంబ సభ్యులు గమనించేసరికి.. అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.