రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి.. నేడు పేద ప్రజలపై వేలాది రూపాయల ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు.
కరోనా నేపథ్యంలో పనుల్లేక, ఉపాధి కోల్పోయి అల్లాడుతుంటే.. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఏమిటని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఛార్జీలు రద్దు చేసి.. పాత స్లాబ్ ప్రకారం కరెంటే బిల్లులు వసూలు చేయాలని వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి.. మూగజీవాల ఆకలి తీరుస్తున్న కానిస్టేబుల్