ఉదయాస్తమాన సేవాటికెట్ల ద్వారా తితిదేకు రూ.85 కోట్లు విరాళంగా అందిందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అందులో శుక్రవారానికి సంబంధించిన టికెట్లు పూర్తిగా భక్తులు కొనుగోలు చేశారని వెల్లడించారు. తిరుపతిలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భక్తుల నుంచి ఇలా విరాళంగా స్వీకరించి వారికి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేశామని తెలిపారు.
రూ.9.20 కోట్ల విరాళం
చెన్నై మైలాపూర్‌కు చెందిన డాక్టర్ పర్వతం పేరిట ఉన్న రూ.9.20 కోట్ల విలువైన ఆస్తులు, నగదు డిపాజిట్లను ఆమె సోదరి రేవతి విశ్వనాథం తితిదేకు విరాళంగా ఇచ్చారు. పర్వతం చనిపోవడంతో ఆమె జ్ఞాపకార్థం రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీవారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఇది చదవండి:
TTD BUDGET: తితిదే బడ్జెట్ 3,096 కోట్లు...త్వరలో ఆర్జిత సేవల పునరుద్ధరణ