మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒత్తిడితో రెవెన్యూ అధికారులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని న్యాయమూర్తి రామకృష్ణ ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో న్యాయమూర్తి రామకృష్ణ, విశ్రాంత వీఆర్‌ఓ వెంకటరెడ్డి మధ్య 2 నెలలుగా భూవివాదం నెలకొంది. న్యాయమూర్తి రామకృష్ణ ఇంటి ఎడమవైపు ఉన్న రహదారి హక్కులపై విశ్రాంత వీఆర్‌ఓ, న్యాయమూర్తి మధ్య వివాదం సాగుతోంది. భూ వివాదం శాంతిభద్రతల సమస్యగా మారుతోందని రహదారిపై నిషేధాజ్ఞలు విధించాలని బి.కొత్తకోట ఎస్.ఐ సునీల్‌కుమార్... తహసీల్దార్ హరికుమార్‌కు సిఫార్సు చేశారు.
ఈ కారణంగా.. 145 సీఆర్పీసీ సెక్షన్ అమలు చేస్తూ వివాదానికి కారణమైన రహదారిపై నిషేధం విధించారు. రహదారిపై తనకే పూర్తి హక్కులు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు నిషేధం విధించారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. రెవెన్యూ అధికారుల చర్యలతో నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లలేక పోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం