కొవిడ్ పేరుతో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించకపోవడం సరికాదని లలితా పీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని పుష్కర స్నానాలు ఆచరించేందుకు ప్రజలను అనుమతించాలని కోరారు. తిరుపతిలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ సమావేశాలు నిర్వహణకు అడ్డురాని కరోనా... పుష్కరాలకే అడ్డుతగులుతుందా అని స్వరూపానంద ప్రశ్నించారు.
తుంగభద్ర పుష్కరాలకు ప్రజలను అనుమతించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పుష్కరాలను ఆపితే హిందువులు ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. 12 ఏళ్ళకోసారి వచ్చే పుష్కరాలను నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.
ఇదీ చదవండి:
మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం... కార్మిక నేతల అరెస్టు