ETV Bharat / state

వరసిద్ధి వినాయక లడ్డూ ధరలు పెంపు..ఉత్తర్వులు జారీ

author img

By

Published : Sep 27, 2019, 11:55 PM IST

కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రస్తుతం ఉన్న లడ్డూ ధరలను పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

laddu cost rise of kanipaka varasiddi vianayaka


కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరలు పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. రూ. 10 ఉన్న లడ్డూ ధర రూ. 15 ... రూ.50 లడ్డూ ధర రూ. 75కు పెంచారు. రూ. 100 ఉన్న లడ్డూ ధర రూ. 150కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన లడ్డూ ధరలను త్వరలోనే అమలు చేస్తామని ఆలయ ఈవో తెలిపారు.


కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరలు పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. రూ. 10 ఉన్న లడ్డూ ధర రూ. 15 ... రూ.50 లడ్డూ ధర రూ. 75కు పెంచారు. రూ. 100 ఉన్న లడ్డూ ధర రూ. 150కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన లడ్డూ ధరలను త్వరలోనే అమలు చేస్తామని ఆలయ ఈవో తెలిపారు.

Intro:వైభవంగా అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ గంధ మహోత్సవం


Body:ఉదయగిరి లోని పంచాయతీ బస్టాండ్ సమీపంలో వెలసియున్న హజరత్ ఖ్వాజా షా అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ ఖాదిరి ఔలియా వారి 214వ వారి గంధ మహోత్సవం వైభవం జరిగింది. ఉదయగిరి తో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాలోని సమాధి లపై పూల చాందినిలు కప్పి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి భక్తులు, దర్గా కమిటీ ఆధ్వర్యంలో గంధ మహోత్సవానికి తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్గాకు దర్శనం కోసం రావడంతో దర్గా ప్రాంగణం రద్దీగా మారింది. గంధ మహోత్సవం లో పాల్గొని దర్గాలో కోర్కెలు కోరితే అంతా శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం ఉండటంతో దర్గా లో దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. గంధ మహోత్సవం సందర్భంగా దర్గా ప్రాంగణంలోని వీధుల్లో భక్తుల రద్దీ కొనసాగింది. హక్కుదారులు ఇంటినుంచి గంధాన్ని పురవీధుల్లో ఊరేగింపు గా శనివారం తెల్లవారుజామున తరలించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు అనంతరం భక్తులకు పంచిపెట్టే ఏర్పాట్లు చేశారు.


Conclusion:రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ : 8008573944

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.