స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాం కుప్పం 14 వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. కావాలనే తన నామినేషన్ తిరస్కరించారని అభ్యర్థి వెంకటేష్ ఆరోపిస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు తనకు చెప్పినట్లు వెంకటేశ్ వెల్లడించారు. ఉదయం పత్రాలు చూసి సక్రమంగానే ఉన్నాయని చెప్పి..ఇప్పుడు నామినేషన్ తిరస్కరించినట్లు వాపోయారు.
కాగా..నిన్న నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లిన వెంకటేశ్‌పై వైకాపా కార్యకర్తలు దాడి చేసి, నామపత్రాలు చించేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి
కుప్పంలో టెన్షన్.. తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు