చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం పెండేరువారిపల్లిలో బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 12న పెండేరు వారిపల్లెలో ఓ బాలికను కడప జిల్లా మిట్టపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా... భయపడి నిందితులు ఆమెను తంబళ్లపల్లిలో వదిలేశారు. తనపై లైంగిక దాడి చేశారని బాలిక చేసిన ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి వారికోసం గాలిస్తున్నారు.
నిందితులు అశోక్ కుమార్(19), ఈశ్వరయ్య(58) కడప జిల్లా చెర్లోపల్లి సమీపంలోని ఓ మామిడితోటలో తలదాచుకుంటున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు శివయ్య (24) కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండీ... Anandaiah: నన్ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు: ఆనందయ్య