సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ పార్థివదేహం నిన్న అర్ధరాత్రి చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం యలమందకు చేరుకొంది. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను నెల్లూరు ఆసుపత్రి నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. చెన్నైలోని అపోలో(apolo hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ వైద్యం కోసం రూ.17లక్షలు మంజూరు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 10న మహేశ్ మృతి చెందారు.
ఇదీ చదవండి