తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస హోమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ దక్షిణామూర్తిస్వామివారికి హోమం చేసి.. పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షి అమ్మవారికి కలశస్థాపన, పూజ, జపం, హోమం, లఘు పూర్ణాహుతి, విశేష దీపారాధన నిర్వహించారు. నేటి నుంచి డిసెంబరు 2 వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం జరుగనుంది.
ఇవీ చూడండి: