చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కాణిపాకం ఆలయ ఈవో వెంకటేశ్వర్లు దంపతులు.. పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కాణిపాకం ఆలయం తరఫున స్వామివారికి సారె అందజేశారు. వెంకటేశ్వర్లు దంపతులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అతనతరం ఆలయ తరఫున తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: