NALLARI KIRAN KUMAR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి కలికిరిలో బుధవారం ఘన స్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కలికిరి రహదారులు, భవనాల శాఖ అతిధి గృహానికి ఉదయం 12:20 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి కేఎస్ అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్ మాజీ కార్యదర్శి డాక్టర్ శ్రీవర్ధన్, పలువురు నాయకులు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులను పేరుపేరునా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వచ్చిన కుమారుడు నిఖిలేష్‌కుమార్‌రెడ్డిని అందరికీ పరిచయం చేశారు. అక్కడికి చేరుకున్న యువత, కార్యకర్తలు కిరణ్‌కుమార్‌రెడ్డి కుమారుడు నిఖిలేష్‌కుమార్‌రెడ్డితో సెల్ఫీలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్వగ్రామం నగిరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం కలికిరికి వచ్చినట్లు సమాచారం. కలికిరిలో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కలికిరి నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట వ్యక్తిగత కార్యదర్శి క్రిష్ణప్ప, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
మదనపల్లె పట్టణం : మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డిని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం ఆయన మార్గంమధ్యలోని నరేష్‌కుమార్‌రెడ్డికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇటీవల ప్రమాదశాత్తు కిందపడి ఎడమచేయి స్వల్పంగా దెబ్బతింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత మదనపల్లెలోని ఇంటికి చేరుకున్నారు. మదనపల్లె బైపాస్ రోడ్డులో నివాసముంటున్న నరేష్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.
ఇవీ చదవండి: