ETV Bharat / state

విషాదం: విద్యుదాఘాతంతో జెఎల్​ఎం మృతి

విద్యుత్​ మరమ్మతుల్లో తప్పిదంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముసలికుంట విద్యుత్​ ఉపకేంద్రం పరిధిలో జరిగింది. విధులు నిర్వహిస్తున్న జేఎల్​ఎం నరేష్​ కుమార్​ (25) ఎల్​సీ ఇవ్వడంలో తప్పిదం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

jlm died due to electric shock in chittoor district
ఎల్​సీ ఇవ్వడంలో జరగిన పొరపాటు వల్ల ప్రమాదం
author img

By

Published : Jun 20, 2020, 10:17 PM IST

చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం ముసలికుంట విద్యుత్​ ఉపకేంద్రం పరిధిలో విధులు నిర్వహిస్తున్న జేఎల్​ఎం నరేష్​ కుమార్​ (25) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. విద్యుత్​ మరమ్మతుల నేపథ్యంలో ఎల్​సీ ఇవ్వడంలో జరిగిన పొరపాటు కారణంగా ప్రమాదం సంభవించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పెద్దమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.