ETV Bharat / state

జెసీబీని దొంగిలించి రూ. 6లక్షలకు అమ్మారు.. పోలీసులకు చిక్కారు!

చిత్తూరు జిల్లాలో జేసీబీని దొంగిలించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత నెల 26వ తేదీన ఈ చోరీ జరగ్గా.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

jcb robbers arrest
కలికిరిలో జేసీబీ దొంగల అరెస్ట్
author img

By

Published : Apr 3, 2021, 7:48 PM IST

చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలోని ఓ సినిమా థియేటర్ వద్ద నిలిపి ఉన్న జేసీబీ వాహనాన్ని దొంగిలించి రూ.6 లక్షలకు అమ్మిన దొంగల ముఠాను కలికిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం జిల్లా బత్తలపల్లికి చెందిన హేమంత్ ప్రసాద్ కలికిరి ప్రాంతంలో జరుగుతున్న కాలువ తవ్వకాలు పనుల్లో తన జేసీబీని ఉపయోగిస్తున్నాడు. గత నెల 26వ తేదీన కలిగిరికి చెందిన జెసీబీ ఆపరేటర్లు రమణ, ఆనంద్, వెంకటేశ్వర్లు ఆ వాహనాన్ని తస్కరించి శాంతిపురం మండలానికి చెందిన ఆర్. ఎస్. మనీ, నాగరాజు, చంద్రశేఖర్, రామచంద్రలకు రూ.6 లక్షలకు అమ్మేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.