ప్రజలకు నివాసయోగ్యమైన ఇళ్ల స్థలాలను పంపీణీ చేయాలని చిత్తూరు జనసేన నేత గంగాధర్, నెల్లూరు ఇంచార్జ్ యుగంధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కార్వేటి ప్రాంతంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వానికి జవాబుదారితనం లోపించిందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించి పేదలందరికీ న్యాయం జరిగేలా చూడాలని యుగంధర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రజాసంక్షేమం కోసం కల్పించిన హక్కులను కాలరాయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయం చేయకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో నియోజకవర్గ జనసేన గౌరవ అధ్యక్షుడు లోకనాథం నాయుడు యుగంధర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఇదీ చదవండీ... సైకో చేష్టలకు కళా వెంకట్రావు అరెస్టు పరాకాష్ట: చంద్రబాబు