సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లులను నిరసిస్తూ చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో ముస్లింలు రీలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు జమియత్ ఉల్మా ఏ హింద్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆఫీజ్ పిర్ షబ్బీర్ అహ్మద్ మద్దతు తెలిపారు. హైదరాబాద్ నుంచి కలికిరికి చేరుకున్న ఆయన రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 1 నుంచి నిర్వహించనున్న ఎన్ఆర్సీ సర్వేకు ఎవరు సహకరించొద్దని పిలుపునిచ్చారు. ఈ బిల్లులను ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
దీక్షలో నినాదాలు చేస్తున్న జమియత్ ఉల్మా ఏ హింద్ అధ్యక్షుడు
By
Published : Feb 26, 2020, 9:39 AM IST
..
కలికిరిలో ముస్లింల ధర్నాకు మద్దతుగా జమియత్ ఉల్మా ఏ హింద్ అధ్యక్షుడు