సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టు నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయంటూ పోలీసులు పదేపదే హెచ్చరించినప్పటికీ... గ్రామస్థులు సంప్రదాయాలను గౌరవించండి అంటూ పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల్లికట్టు వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలను పూజించి, పశువులకు ప్రత్యేకంగా పూజలు జరిపారు.
పశువులను నియంత్రించేందుకు యువకులు ప్రయత్నించారు. పశువుల కిందపడి గాయాలపాలైనా లెక్కచేయకుండా సందడి చేశారు. వీక్షకుల పైకి పశువులు దూసుకెళ్లడంతో కొందరికి గాయాలయ్యాయి. జల్లికట్టు తిలకించడానికి ప్రజలు పోటెత్తారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండి