ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వహక అధ్యక్షుడు తులసి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు...ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి కేసు,వివేకా హత్యకేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తులసిరెడ్డి మాట్లాడుతూ..జగన్ పాలన పిచ్చోడి చేతిలో ఏకే-47ల తయారైందన్నారు. వారి అసమర్థ నిర్ణయాలతో రాష్ట్రప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శైలజానాథ్ మాట్లాడుతూ...వైఎస్ మండలిని ఏర్పాటు చేస్తే ఆయన కొడుకు దాన్ని రద్దు చేసి వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారన్నారు. ఆయనకు ధైర్యముంటే..శాసనసభలో పౌరసత్వ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని సవాల్ విసిరారు.
'జగన్ గారు...మీ కోడి కత్తి కేసు ఏమైంది?' - జగన్ పై శైలజానాథ్ మండిపాటు
ఎన్నికల ముందు జరిగిన కోడికత్తి కేసు, వివేకా హత్యకేసు ఏమయ్యాయని సీఎం జగన్ను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో ఏకే-47ల తయారైందని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వహక అధ్యక్షుడు తులసి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు...ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి కేసు,వివేకా హత్యకేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తులసిరెడ్డి మాట్లాడుతూ..జగన్ పాలన పిచ్చోడి చేతిలో ఏకే-47ల తయారైందన్నారు. వారి అసమర్థ నిర్ణయాలతో రాష్ట్రప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శైలజానాథ్ మాట్లాడుతూ...వైఎస్ మండలిని ఏర్పాటు చేస్తే ఆయన కొడుకు దాన్ని రద్దు చేసి వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారన్నారు. ఆయనకు ధైర్యముంటే..శాసనసభలో పౌరసత్వ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని సవాల్ విసిరారు.
ఇదీచదవండి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.1,500 కోట్లు: సీఎం జగన్