Infant death: సకాలంలో వైద్య సేవలు అందక బాలింత తోపాటు శిశువు చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగింది. రామకుప్పం మండల రాజుపేట యానాది కాలనీలో కృష్ణవేణి అనే మహిళ ఆదివారం రాత్రి ఇంట్లోనే కవల పిల్లలను ప్రసవించింది. ప్రసవం అనంతరం ఆమె అరోగ్యం విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు రామకుప్పంలోని 24 గంటల ప్రాథమిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు లేరని సిబ్బంది సమాధానం ఇవ్వడంతో కుప్పం వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా వైద్యం అందలేదు. దీంతో బంధువులు ప్రైవేట్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం పొందుతూ పరిస్థితి విషమించడంతో తల్లి కృష్ణవేణితో పాటు శిశువు కూడా చనిపోయింది. సరైన వైద్యం అందక బాలింత శిశువు చనిపోవడం బాధాకరం అని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు ప్రభుత్వ ఆస్పత్రుల వ్యవస్థను నాశనం చేశారు అని విమర్శించారు.
-
కుప్పంలో సైతం ఆస్పత్రుల వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే ఈ దారుణానికి కారణం. కుప్పాన్ని పులివెందులలా చూసుకోవడం అంటే ఇదేనా?(2/2)#IdhemKarmaManaRashtraniki
— N Chandrababu Naidu (@ncbn) November 21, 2022 ." class="align-text-top noRightClick twitterSection" data="
.">కుప్పంలో సైతం ఆస్పత్రుల వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే ఈ దారుణానికి కారణం. కుప్పాన్ని పులివెందులలా చూసుకోవడం అంటే ఇదేనా?(2/2)#IdhemKarmaManaRashtraniki
— N Chandrababu Naidu (@ncbn) November 21, 2022
.కుప్పంలో సైతం ఆస్పత్రుల వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే ఈ దారుణానికి కారణం. కుప్పాన్ని పులివెందులలా చూసుకోవడం అంటే ఇదేనా?(2/2)#IdhemKarmaManaRashtraniki
— N Chandrababu Naidu (@ncbn) November 21, 2022
ఇవీ చదవండి: