కర్ఫ్యూ కారణంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గల ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో అంతర్ రాష్ట్ర చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. సరిహద్దు వద్ద ఉన్న మంగాడు చెక్‌పోస్టు వద్ద..రాష్ట్రం నుంచి తమిళనాడుకు అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 221 మద్యం బాటిళ్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని నగరి సీఐ మదయ్యచారి తెలిపారు.
ఇదీ చదవండి:
Remdesivir: బ్లాక్ మార్కెట్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు