తిరుపతి ఐఐటీలో తొలిదశలో నిర్మించిన శాశ్వత భవనాలను కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పది జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని... ఆంధ్రప్రదేశ్లో జరిగినంత అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన కొనియాడారు. పనులు పూర్తి చేసి బిల్లులు పెడితే....నిధులను అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వివరించారు. 2015 తర్వాత దేశంలో ఏర్పాటైన ఆరు ఐఐటీలలో తిరుపతి అత్యుత్తమంగా ఉందని ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేవిధంగా కృషి చేస్తోందని వివరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 104 మంది విద్యార్థులకు పతకాలు అందచేశారు.
ఇదీ చూడండి: వైకాపా ప్రభుత్వ తీరుపై.. చంద్రబాబు సూపర్ సెటైర్