ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం... పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలూ అధికం

author img

By

Published : Apr 20, 2021, 7:54 AM IST

ఉప ఎన్నికల ప్రచారం, తిరుమలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక... కారణమేదైనప్పటికీ చిత్తూరుల జిల్లాను కొవిడ్ భూతం వణికిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య అదేస్థాయిలో ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్విమ్స్‌లో నాలుగు రోజుల్లోనే 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు నిర్వహణకు వీలుగాక...ఆస్పత్రి మార్చురీలు నిండిపోయాయి.

huge-corona-cases-deaths-registered-in-chithore-district
చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం
చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం

కరోనా రెండో దశ చిత్తూరు జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. వరుసగా నాల్గో రోజూ కొవిడ్ కేసులు వెయ్యి దాటాయి. ఆదివారం ఒక్కరోజే తిరుపతి నగరంలో 687పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా... తిరుపతి గ్రామీణ మండలంలో 109 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 22 ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స ఆందిస్తున్నారు. ఓ వైపు పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజుకు రోజుకు తీవ్రం అవుతుండగా... స్విమ్స్‌ ఆసుపత్రిలో మరణాల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రి కావడంతో రాయలసీమ జిల్లాల నుంచి ఆరోగ్యం విషమించిన కేసులు స్విమ్స్‌కు తరలిస్తున్నారు. దీంతో స్విమ్స్‌ ఆసుపత్రిలో మరణాలు సంఖ్య పెరిగిపోతోంది. కరోనాకు చికిత్స పొందుతూ శనివారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు.

కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలను కొంతమంది కుటుంబసభ్యులు ఆస్పత్రిలోనే వదిలి వెళ్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు పరిసర ప్రాంతాల మృతులను అంత్యక్రియల కోసం తిరుపతి గోవింద ధామం విద్యుత్‌ స్మశాన వాటికకు తీసుకువస్తున్నారు. కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలు రోజుకు పన్నెండు నుంచి పదిహేను వరకు వస్తున్నాయి. శుక్రవారం 11, శనివారం 12, ఆదివారం 14 మందికి కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాతే ఎక్కువ మందిని స్విమ్స్‌కు తీసుకొస్తుండటంతోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

కొవిడ్ నియంత్రణకు మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు

'కరోనా కట్టడిలో టీకాయే శక్తిమంతమైన ఆయుధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.