ETV Bharat / state

సాధారణ వైద్యానికి అన్నీ సమస్యలే

నగరంలోని జీవకోనకు చెందిన వృద్ధురాలు పూతలపట్టులోని కుమార్తె వద్దకు వెళ్లింది. అక్కడ శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో చిత్తూరుకు వెళ్లారు. అక్కడ ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్పత్రులలో చేర్చుకోలేదు. తిరుపతికి వచ్చి నాలుగు పెద్ద ఆస్పత్రుల వద్దకు వెళ్లినా కాదన్నారు. చివరకు రుయా, స్విమ్స్‌కు వెళితే కరోనా పరీక్ష చేసుకోమని సలహా ఇచ్చారు. వీరిద్దరే కాదు.. దీర్ఘకాలిక, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య సేవలు అందక ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

hospital
hospital
author img

By

Published : Aug 6, 2020, 9:00 AM IST

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలో చాలా కాలంగా కేవలం కొవిడ్‌ వైద్యసేవలే అందిస్తున్నాయి. స్విమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడటంతో ఓపీలు రద్దు చేశారు. బర్డ్‌, ఆయుర్వేద వైద్యశాలలలో సేవలు నిలిపివేశాయి. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో ఆ దిశగా ప్రైవేటు వైద్యశాలలు సేవలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 18 ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ వైద్యశాలలుగా మార్చగా.. త్వరలో మరో 30 ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఆపత్కాలంలో సేవలందించకుండా పలు ప్రైవేటు ఆస్పత్రులను ఇప్పటికీ మూసివేసి ఉంచారు. కేవలం కొవిడ్‌ సేవలపైనే దృష్టి సారిస్తున్నారు. సాధారణ వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. గురువారం తిరుపతికి వస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ సేవలపై దృష్టి సారించాల్సి ఉంది.

తిరుపతి సప్తగిరి కాలనీకి చెందిన శేఖర్‌ ఛాతీ, శరీర నొప్పులతో రుయా ఆస్పత్రి చుట్టూ మూడు రోజులు తిరిగినా చేర్చుకోలేదు. నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వద్దకు వెళ్లినా రుయాకే వెళ్లమన్నారు. కరోనా ఉందని అందరూ భయపడుతున్నారని తలచి.. చివరకు సంజీవని బస్సు వద్ద కొవిడ్‌ పరీక్షకు వెళ్లాడు. అక్కడ క్యూలో నిరీక్షించి.. చివరకు కుప్పకూలి చనిపోయాడు.

కొన్నే.. అయినా మోతే..

విపత్కర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించకుండా మూసివేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్నే తెరచుకున్నాయి. చాలా వరకు ఇప్పటికీ మూతపడి ఉన్నాయి. తెరచుకున్న కొన్ని కొవిడ్‌ ఆస్పత్రులు కాగా.. మరికొన్ని ఆస్పత్రిలో భౌతిక దూరం పాటిస్తూ సాధారణ ఓపీ సేవలు అందిస్తున్నాయి. ఓపీ రుసుం పెంచేచారు. రోగిని దగ్గరగా పరీక్షించాల్సి వచ్చినా.. శస్త్ర చికిత్సలు అవసరమైనా కొవిడ్‌ పరీక్ష తప్పనిసరంటూ పంపివేస్తున్నారు. వారు కొవిడ్‌ పరీక్ష చేసుకుని నివేదిక తీసుకెళ్లాలంటే వారం పది రోజులు తప్పదు. విషమ పరిస్థితుల్లో ఉన్నవారి పరిస్థితి అప్పటి వరకు కష్టమే. కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ స్వయాన డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇటీవల పుత్తూరులో ఆరోపించారు.

రుయా, స్విమ్స్‌లో ఓపీలు ప్రారంభిస్తేనే..

పేదల ఆస్పత్రి రుయా.. నాణ్యమైన వైద్యం అందించే స్విమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నాలుగైదు నెలలుగా ఆస్పత్రుల వైపు రావడం లేదు. ప్రమాదాల శాతం తగ్గినా గాయపడిన వారికి సరైన వైద్యం అందడం లేదు. వాతావరణ మార్పులతో వచ్చే జలుపు, జ్వరం, శ్యాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారిని ప్రైవేటు ఆస్పత్రులు దగ్గరికి రానీయకుండా.. కరోనా లక్షణాలు ఉంటేనే రావాలని చెప్పడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి.

వైద్యసేవలు అందిస్తున్నాం

జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు వైద్యసేవలు అందిస్తున్నాయి. జిల్లా కలెక్టరు, సమన్వయ కమిటీ సూచనల మేరకు కొన్ని ఆస్పత్రులు కొవిడ్‌ వైద్యం ప్రారంభించాయి. ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ వైద్య సేవలు ప్రారంభించని ఆస్పత్రులు ఉంటే వారితో మాట్లాడతాం. - డాక్టర్‌ డి.శ్రీహరిరావు, ఐఎంఏ జిల్లా కో ఆర్డినేటర్‌

ఇదీ చదవండి: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా వెంకయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.