శ్రీవారి ఆస్తుల పరిరక్షణ చర్యల్లో సహాయ సహకారాలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి.. ఎవరు నేతృత్వం వహిస్తారో చెప్పాలని తితిదేను హైకోర్టు ప్రశ్నించింది. విశ్రాంత న్యాయమూర్తులు, తదితరులతో ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహించేది ఎవరో స్పష్టం చేయకుండా.. ఆస్తుల పరిరక్షణ ఏ విధంగా సాధ్యమని వ్యాఖ్యానించింది. కమిటీలో విశ్రాంత న్యాయమూర్తులకు ప్రోటోకాల్ ప్రకారం స్థానం కల్పించాలని ఆదేశించి.. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
తితిదేకు చెందిన 23 ఆస్తుల వేలాన్ని నిలువరించాలని కోరుతూ... భాజపా నేత అమర్నాథ్ గతేడాది హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై తితిదే ఇటీవలే కౌంటర్ దాఖలు చేసింది. ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేశామనీ.. తీర్మానాలు చేశామని తితిదే పేర్కొంది. కానీ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారో నివేదించలేదు. దీని కోసం తితిదే తరఫున న్యాయవాది సమయం కోరగా.. ధర్మాసనం అందుకు అంగీకరించింది.
ఇదీ చదవండి: