చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దిరాజు.. న్యాయమూర్తికి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను నిర్వహించారు. అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఆవరణంలో గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఇదీ చదవండి:
'శాశ్వత ప్రాతిపదికన.. భక్తులకు సంప్రదాయ భోజనం అందిస్తాం..'