తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డికి హై9 హీరోస్ అవార్డు దక్కింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి నుంచి రమేష్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా నిలబడి నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ రక్షణగా కవచంలా నిలిచిన పోలీసులకు నాయకత్వం వహించిన రమేష్‌రెడ్డిని అవార్డుకు ఎంపిక చేశారు. మెరుగైన కొవిడ్ సేవలు అందించినందుకు ఇప్పటికే ఆయన స్కోచ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఎస్పీకి పలువురు అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి...