ETV Bharat / state

vani vishwanath: వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం తథ్యం- సినీ నటి వాణీవిశ్వనాథ్ - vani vishwanath participating upcoming elections from nagari

vani vishwanath: నగరి నియోజకవర్గంలో తన అభిమానులు వేలాదిగా ఉన్నారని.. తమ అభిమానుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సినీ నటి వాణీ విశ్వనాథ్ తెలిపారు. ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం మాత్రం తథ్యమని తనకు అభిమానులతో పాటు అధిక సంఖ్యలో మహిళల ఆదరణ సైతం ఉందన్నారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీ అనేది ముందుగా ప్రకటిస్తానని తెలిపారు.

heroine vani vishwanath
ప్రజాసేవ కోసం నగరి నుంచి పోటీ చేయడం తథ్యం
author img

By

Published : Mar 9, 2022, 8:14 PM IST

vani vishwanath: ప్రజాసేవ చేయడానికి నగరి నుంచి పోటీ చేయడం తథ్యమని సినీ నటి వాణీ విశ్వనాథ్ అన్నారు. నగరి నియోజకవర్గంలో తన అభిమానులు వేలాదిగా ఉన్నారని తమ అభిమానుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ఏ పార్టీలో పోటీ చేస్తానని చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీ అనేది ముందుగా ప్రకటిస్తానని తెలిపారు. ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం మాత్రం తథ్యమని తనకు అభిమానులతో పాటు అధిక సంఖ్యలో మహిళల ఆదరణ సైతం ఉందన్నారు.

తన మేనేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక తాను ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధపడ్డానన్నారు . నలుగురికి సాయం చేసే వ్యక్తికే ఇలా ఇబ్బందులు తలెత్తితే, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని అన్నారు. అందుకే నగరి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒకటో వార్డులో గల శామాలమ్మ గుడివద్ద మహిళలు, కౌన్సిలర్లు మంగళహారతులతో స్వాగతం పలికారు.

వాణీ విశ్వనాథ్ శామాలమ్మకు ధూపదీప నైవేద్యాలతో మొక్కులు తీర్చుకుని నగిరి నుంచి ఎన్నికలలో ఆరంగేట్రం చేయడానికి మొదటి విడతగా ఈ దేవాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు .నగరిలో మా అమ్మమ్మ నర్సుగా పని చేసిందని నగర ప్రాంత వాసులు తనకు సుపరిచితులని నగిరిలో తమిళ సంస్కృతి సైతం ఉందని తెలిపారు. అందుకే నగరి నుంచి పోటీ చేసి ప్రజాసమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమేనన్నారు . అనివార్యమైతే ఇండిపెండెంట్ గా సైతం పోటీ చేయడానికి సిద్దమేనని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రామానుజం చలపతి, ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ లత, లక్ష్మి, అలిమేలు కన్నెమ్మ, ఆదెమ్మ, భారతి మణివన్నన్, వరదన్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రేపు కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.