శ్రీవారి తమిళ భక్తులకు పవిత్రంగా భావించే పెరటాసిమాసం ఆఖరివారం కావటంతో..తిరుమలకు తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం 1,2 లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. సాధారణ సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. క్యూలలో వేచి ఉండలేక అనేకమంది భక్తులు దర్శనం చేసుకోకనే వెను తిరుగుతున్నారు. నిన్న సుమారు లక్షమంది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ.3 కోట్ల 13 లక్షల హుండీ ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది.
ఇదీ చదవండి:పలాసలో జీడిపప్పుతో స్వామివారికి అలంకరణ