ETV Bharat / state

హైకోర్టు ఆగ్రహం: పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా ?

పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణలో..కొన్నిప్రాంతాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. స్టాండింగ్ ఆర్డర్స్‌కు విరుద్ధంగా పశువుల మేత భూములను సైతం కేటాయిస్తూ జీవో ఎలా జారీ చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే నిర్మించిన ఇళ్లను పక్కనబెట్టి హడావుడి చేయడం ఎందుకని ప్రశ్నించిన ధర్మాసనం...చిత్తూరు జిల్లాలో 31 ఎకరాల్లో ఇళ్లస్థలాల ప్రతిపాదనపై స్టే విధించింది.

పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా ?
పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా ?
author img

By

Published : Jul 16, 2020, 4:46 AM IST

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కోసం భూసేకరణ, స్థలాల కేటాయింపు విషయంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు అనుసరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం పశువుల మేత కోసం కేటాయించిన భూములు, నదులు, చెరువులు, కుంటల తీర ప్రాంతాలను ఇతర అవసరాలకు వినియోగించడం నిషేధమని స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఆదెనపల్లిలో పశువుల మేత కోసం ఉద్దేశించిన 31.79 ఎకరాల్లో ఇళ్ల పట్టాలిచ్చే ప్రతిపాదనపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చే అధికారం అధికారులకు ఎక్కడుందని నిలదీసింది. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇళ్లస్థలాల పేరుతో కొందరు అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో అధికారుల తీరును సవాలు చేస్తూ సింగిల్ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలన్నింటినీ అవసరమైయితే ధర్మాసనం ముందుకు తెప్పించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

పశువుల మేత కోసం కేటాయించిన భూముల్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.ఆ భూముల స్వభావాన్ని మార్చకుండా అధికారులను నిలువరించాలని కోరారు. భూసేకరణలో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పశువుల మేతకు కేటాయించిన భూముల్లో ఇళ్ల స్థలాల కోసం 4 ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే జీవో నెంబర్ 558 జారీ చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలపై అసంతృప్తి వ్యక్తంచేసిన ధర్మాసనం...బోర్టు స్టాండింగ్ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల వ్యవహారంలో సాధారణ ఆదేశాలిచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని తేల్చి చెప్పింది. ఆదెనపల్లిలో పశువుల మేత కోసం ఉద్దేశించిన భూముల్లో ఇళ్ల పట్టాలు, స్థలాలిచ్చే ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 4 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్, పాకాల ఆర్డీవో, తహశీల్దార్లను ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇదే తరహాలోని మరో వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే జేకే మహేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు పరిధిలో తన చేపల చెరువులోని 150 సెంట్ల భూమిలో ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై సీజే విచారణ జరిపారు. ఆ స్థలం విషయంలో పిటిషనర్‌కు హక్కు లేదని... ప్రభుత్వ న్యాయవాది వాదించారు. స్పందించిన సీజే... భూములు తీసుకోవడానికి అనుసరిస్తున్న విధానం, స్కీం వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మించిన గృహాలు ఉన్నప్పటికీ..కొన్నిచోట్ల కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు అందజేయడం లేదని ప్రశ్నించారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇళ్లపట్టాల పంపిణీ అంటూ హడావిడి ఏంటని వ్యాఖ్యానించారు. ఈ వ్యాజ్యంపై విచారణ వారం రోజులకు వాయిదా వేశారు.

ఇదీచదవండి

'యజమాని హక్కులకు భంగం కలగకుండా కొత్త కౌలుదారు చట్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.