ETV Bharat / state

'ఓ సారూ.. ఓసారి మా అవస్థ చూడండి'

No facilities to PHC: ప్రతివారం లాగే.. గత సోమవారం కూడా చిత్తూరు కలెక్టరేట్​లో స్పందన కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకొని సాయం అర్థించేందుకు పలువురు వచ్చారు. కాగా.. అందులో ఓ వ్యక్తికి 90 శాతం వైకల్యం ఉండగా.. అతని కష్టం చెప్పుకునేందుకు కార్యాలయానికి వెళ్లారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ర్యాంపు ఉన్నప్పటికీ దివ్యాంగులను తీసుకెళ్లేందుకు వీల్‌ఛైర్‌ లేకపోవటంతో అతికష్టంమీద ఇలా మోకాళ్లపైనే నడుచుకుంటూ వెళ్లి అధికారులకు అర్జీ సమర్పించారు.

handicapped person faced problems in chittor collectorate as having no wheel chair
చిత్తూరు కలెక్టరెట్​లో ఇబ్బంది పడ్డ దివ్యాంగుడు
author img

By

Published : Jun 15, 2022, 8:03 AM IST

Physically Handicapped Person Problems: అది చిత్తూరు కలెక్టరేట్‌. ఎప్పటిలాగే గత సోమవారం కూడా స్పందన కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకొని సాయం అర్థించేందుకు పలువురు వచ్చారు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండల కేంద్రానికి చెందిన సదాశివకు 90 శాతం వైకల్యం ఉంది. అతడికి రూ.5వేలు పింఛను అందాల్సి ఉండగా కేవలం రూ.3వేలు ఇస్తున్నారు.

పింఛను మొత్తం పెంచాలని విన్నవించేందుకు సదాశివ తన తల్లి వరలక్ష్మి సాయంతో కలెక్టరేట్‌లోని గ్రీవెన్సుకు వచ్చారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ర్యాంపు ఉన్నప్పటికీ దివ్యాంగులను తీసుకెళ్లేందుకు వీల్‌ఛైర్‌ లేకపోవటంతో అతికష్టంమీద ఇలా మోకాళ్లపైనే నడుచుకుంటూ వెళ్లి అధికారులకు అర్జీ సమర్పించారు. దివ్యాంగుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడో వీల్‌ఛైర్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.