చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని 9 మండలాల్లో 9 వేల క్వింటాల వేరుశెనగ రాయితీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి.. పీలేరు, కలికిరి మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అధికారులకు సహకరించాలని సూచించారు.
కె6, నారాయణి రకాల విత్తనాలను రాయితీ పోను 30 కిలోల వేరుశెనగ బస్తా ధర రూ.1,413 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సాగులో వర్షాధార వేరుశనగకు అవసరమైన కాయలను రైతులు కొనుగోలు చేశారు. అదే విధంగా.. ఖరీఫ్ సాగుకు అవసరమైన పెట్టుబడి నిధిని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు.
ఇదీ చూడండి: