తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సర్కారు తరపున పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
అమ్మవారికి సారె
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పంచమతీర్థం సందర్భంగా స్వామి వారి నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. తిరుమాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం తిరుచానూరుకు సారె తీసుకెళ్లారు. సారె సమర్పణ అనంతరం పంచమతీర్థం ప్రారంభం కానుంది. ఈ ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.83 కోట్లు వచ్చింది.
ఇదీ చూడండి: