తిరుపతి వెంకటేశ్వర పశువైద్య విశ్వద్యాలయంలో 9వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ హాజరయ్యారు. యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు గవర్నర్ పట్టాలు అందజేశారు. ఉత్తమ ప్రదర్శన కనపరిచిన 33 మంది విద్యార్ధులకు బంగారుపతకాలు, ఇద్దరికి కాంస్య పతకాలను అందించారు. పశువైద్యంలో పట్టాలు పొందిన వైద్యులు తమ కుటుంబానికే కాకుండా దేశం, రాష్ట్రం అభివృద్దికి తమ వంతు సేవలు అందించాలని గవర్నర్ అన్నారు. తమ సమస్యలు చెప్పుకోలేని మూగజీవాలకు వైద్యం చేసే అరుదైన అవకాశం దక్కించుకున్న పశువైద్యులు అభినందనీయులన్నారు. స్నాతకోత్సవానికి ముందు పశువైద్య విశ్వవిద్యాలయంలో మొక్క నాటి, రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు.
ఇదీ చూడండి: