ETV Bharat / state

'అన్నదాతలను ఆదుకునేందుకు 9 గంటల విద్యుత్ ' - 9 గంటల విద్యుత్

రైతులకు 9 గంటల విద్యుత్‌ సరఫరాకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ చర్యలు చేపట్టింది. ఇందుకు ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఫీడర్ల విభజనలో నిమగ్నమైంది. రాయలసీమ సహా 8 జిల్లాల్లో ఇప్పటికే కొన్నిచోట్ల అమలు చేసింది.

farmers
author img

By

Published : Jul 26, 2019, 4:23 PM IST

'అన్నదాతలను ఆదుకునేందుకు 9 గంటల విద్యుత్ '

అన్నదాతలను ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో 9 గంటల పగటి విద్యుత్‌ పంపిణీకి విద్యుత్‌ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఏపీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు సహా... నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో.... తొలి విడతగా కొన్ని పంపు సెట్లకు తొమ్మిది గంటల విద్యుత్‌ పంపిణీ ప్రారంభించింది.

సంస్థ పరిధిలో సుమారు 11 లక్షల 30 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహావసరాలు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసే ఫీడర్లు కలిసి ఉన్నందున... 9 గంటల నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో... వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ చేసే ఫీడర్ల నుంచి... గృహావసరాల ఫీడర్ల విభజనతో నిరంతరాయ విద్యుత్‌ పంపిణీకి వీలు కలుగుతుందని గుర్తించారు.

గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయ పంపుసెట్లు... ఇలా విద్యుత్‌ వినియోగదారులను... మూడు కేటగిరీలుగా విభజించి విద్యుత్‌ సరఫరాకు చర్యలు చేపట్టింది. సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో... వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ చేసే ఫీడర్లను విభజించడానికి... 700 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

ఫీడర్ల విభజనే కాకుండా.... అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఉపకేంద్రాల సామర్థ్యం పెంచనున్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని 8 జిల్లాల్లో వచ్చే మార్చి నాటికి..... లైన్ల విభజనతో పాటు ఉపకేంద్రాల సామర్థ్యమూ పెంచే అవకాశం ఉంది.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_32_26_varsham_p_v_raju_av_AP10025_SD తూర్పుగోదావరి జిల్లా తుని, అన్నవరం ప్రాంతాల్లో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం పంపా జలాశయం లోకి వడి వడి గా ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుంది.

Conclusion:ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.