చిత్తూరు జిల్లా మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో రెండు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. వారం రోజులుగా పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తున్నారు. దుండగులు ఒక పథకం ప్రకారం దొంగతనాలు చేస్తుండటం... పోలీసులను కలవరపెడుతోంది. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న జాతరలకు పోలీసు సిబ్బందిని బందోబస్తుకు పంపటంతో... రాత్రి సమయంలో గస్తీలు తగ్గాయి. వారం రోజుల్లోనే ఆరు దొంగతనాలు జరిగాయంటే తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. నిందితులను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.
మదనపల్లెలో కలవరపెడుతున్న వరుస చోరీలు - చిత్తూరు జిల్లా మదనపల్లె
మదనపల్లెలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ రోజు రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. నగదు, డబ్బును ఎత్తుకెళ్లారు.