చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనల పాటిస్తూ జాతరను జరిపించారు. 200 సంవత్సరాల నాటి సంప్రదాయాలను పాటిస్తూ..పసుపు ముద్దతో అమ్మవారిని ఊరేగిస్తూ ఏడు చోట్ల ప్రతిష్టించారు. సాయంత్రం ఈ పసుపు ముద్దలతో చేసిన అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేశారు.
భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులను పూలతో అలంకరించారు. పొన్నాలమ్మ, అంకమ్మ, భువనేశ్వరి, కావమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, నల్ల గంగమ్మ పేర్లతో ఏడు వీధుల్లో అమ్మవారు కొలువుదీరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి... శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో శ్రీవారి భక్తులకు గదులు