ETV Bharat / state

పిడుగుపాటుకు నలుగురు మృతి - నెల్లూరు జిల్లాలో పిడుగు పాటు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. కడప జిల్లా రాయచోటి వీరభద్రస్వామి ఆలయంపై పిడుగు పాటుతో విద్యుత్ నియంత్రికలు, జనరేటర్ కాలిపోయాయి.

Four people were died with thunderbolt in different areas in andhra pradhesh
వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి
author img

By

Published : Sep 7, 2020, 8:00 PM IST

  • చిత్తూరు జిల్లాలో...

వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఐదుగురు... వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కిందకు చేరుకోగా.. ఒక్క సారిగా చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

  • ప్రకాశం జిల్లాలో...

కొమ్మినేనివారిపాలెం సమీపంలో పిడుగు పడి వీరయ్య అనే గొర్రెల కాపరి మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవటంతో 108 వాహనంలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • నెల్లూరు జిల్లాలో...

వింజమూరు మండలం జనార్ధన్​పురంలో పిడుగుపాటుకు పుల్లయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. రేకుల వరండా కింద కూర్చుని ఉండగా... పెద్ద శబ్దంతో పిడుగు పడింది.

  • కడప జిల్లాలో...

రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంపై సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పిడుగు పడింది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది. ఆలయ ప్రాంగణంలోని రెండు విద్యుత్ నియంత్రికలు, ఆలయానికి చెందిన జనరేటర్ కాలిపోయాయి.

ఇదీ చదవండి:

కావాలనే రథం దగ్ధం చేసినట్టుంది: ఆర్​ఆర్​ఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.