చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని అడవుల్లో ఆదివారం రాత్రి అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో తలకోన చెక్పోస్ట్ సమీపంలోని నిమ్మకాయలబండ వద్ద నెమలి మాంసాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నెమలి మాంసం, ఉచ్చును స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల రాకను గమనించిన మరో ఇద్దరు వేటగాళ్లు పారిపోయారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న వ్యక్తిని భాకరాపేట అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పరారీలో ఉన్నవారి కోసం అధికారులు గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: