చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడు అటవీ ప్రాంతంలో శివలింగం ప్రతిష్ఠించేందుకు స్థానికులు శ్రీకారం చుట్టారు. కొండపై ఉన్న శ్రీ భక్తకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో పాదాల వద్ద శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించి కుంభాభిషేకం నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహ ప్రతిష్ఠ పనులను అడ్డుకున్నారు. అనుమతులు లేనిదే అటవీ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని అధికారులు హెచ్చరించారు. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం(Clash between forest officials and locals) చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: ap rains: వానలు ఆగిన.. తప్పని కష్టాలు