కరోనా నివారణకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఇతర సంఘ సేవకులకు ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ పండ్ల రసాలను పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో శ్రమిస్తున్నవారికి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకే పండ్ల రసాలు పంపిణీ చేసినట్లు ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ పేర్కొన్నారు. మొదట తంబళ్లపల్లి, పెద్దమండ్యం మండలాల్లోని పోలీస్ స్టేషన్లు, మండల పరిషత్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల రసాల ప్యాకెట్లను అందజేశారు.
ఇవీ చూడండి...
భారత సరిహద్దుల్లోకి అక్రమంగా శ్రీలంక బోటు.. పట్టుకున్న కోస్ట్ గార్డ్