శివనామస్మరణతో తంబళ్లపల్లె మల్లయ్య కొండ మారు మ్రోగింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడచిన ఇప్పటి చినుకు జాడ కనిపించకపోవడంతో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వాసులు మల్లికార్జున స్వామి సన్నిధిలో సహస్ర ఘటాభిషేకం, వరుణ యాగాలు నిర్వహించారు. వానలు కురిపించాలంటూ భక్తులు మల్లయ్య కొండను ఎక్కి, శివనామస్మరణ చేశారు. స్థానికంగా ఉన్న వడ్ల రమణ స్వామి, వీరన్న గుహలో వర్షం కోసం తపస్సు చేయడం భక్తులను పరవశింప చేసింది. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ అధికార్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:తెదేపా అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం