కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అనేక మంది పేదలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. టమోటా మార్కెట్లో పనిచేసే కూలీలు, వ్యాపారులు, పట్టణంలో భిక్షాటన చేసేవారు, చేతివృత్తుల వారు తిండికి తిప్పలు పడుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఇది గమనించి ఎలాగైనా సరే వారి ఆకలి తీర్చాలని సంకల్పించారు. ఎస్సై రామాంజనేయులు ఆధ్వర్యంలో మొదటగా 50 మందికి భోజనాలను పార్సల్ చేసి ఇవ్వడం ప్రారంభించారు. పోలీసులకు అండగా దాతలు ముందుకొచ్చారు. తోచిన సాయం చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200ల మందికి భోజనం చేసి అందజేస్తున్నారు.
ఇదీ చూడండి: