ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో నేడు నమోదు కాని కొత్త కేసులు - చిత్తూరు జిల్లా

చిత్తూరు నగరంలో నిన్న తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాలో నిన్న 3 పాజిటివే కేసులు నమోదైయ్యాయి. గడచిన 24 గంటల వ్యవధిలో ఒక్క కేసూ నమోదు కాకపోవడం ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

chittor district
చిత్తూరు రెడ్‌జోన్‌ ఏరియాలో అధికారుల వాహనాల ర్యాలీ
author img

By

Published : May 1, 2020, 11:56 AM IST

Updated : May 1, 2020, 12:21 PM IST

చిత్తూరు జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదు. 24 గంటల్లో పాజిటివ్​ కేసులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని... ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి... కొత్తగా వచ్చిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎవరు జిల్లాకు వచ్చినా పరీక్షలు చేసి... నెగెటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని ప్రభుత్వ క్వారంటైన్​కు తరలిస్తున్నారు.

నిన్నటి పరిస్థితి చూస్తే...

చిత్తూరు జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు గురువారం నమోదయ్యాయి. ఇందులో రెండు శ్రీకాళహస్తిలో కాగా.. మరోటి చిత్తూరులో నిర్ధారణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 80కి చేరగా.. 16 మంది చికిత్స పూర్తి చేసుకుని డిశ్ఛార్జి అయ్యారు. 64 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లా కేంద్రం చిత్తూరులో తాజాగా ఓ కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. తమిళనాడులోని ఆంబూరుకు చెందిన ఓ వాహన మెకానిక్‌ ఆదివారం చిత్తూరులోని తనకు పరిచయస్థురాలి ఇంటికి రాగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆంబూరు రెడ్‌జోన్‌లో ఉండటంతో పోలీసులు అప్రమత్తమై అతనికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా తేలింది. అతని స్నేహితురాలి నివాసమైన 37వ డివిజన్‌తోపాటు 35, 36 డివిజన్‌లను పూర్తి రెడ్‌జోన్‌గా, 39, 42, 43వ డివిజన్లలో కొంతమేర రెడ్‌జోన్‌ పరిధిలోకి చేర్చారు. బాధితుడికి చిత్తూరులోని కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతనితో ఉన్న మహిళకు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ అని తేలగా క్వారంటైన్‌కు తరలించారు. రెడ్‌జోన్లలో 58 బృందాలతో వాలంటీర్లు సర్వే చేస్తున్నారు. కలెక్టర్‌ భరత్‌గుప్తా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌, డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి 37వ డివిజన్‌లో పరిశీలించి ప్రజలకు సూచనలు ఇచ్చారు.

రెడ్‌జోన్‌లో పోలీసులు వాహనాలతో సైరన్‌ మోగిస్తూ గస్తీ నిర్వహించారు. నగరపాలక కమిషనర్‌ ఓబులేశు రెడ్‌జోన్‌లో ఇళ్ల వద్దకే నిత్యావసరాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. చిత్తూరు ఆర్డీవో రేణుక, తహసీల్దారు సుబ్రహ్మణ్యం పర్యటించి రెడ్‌జోన్లుగా ప్రకటించారు. రెడ్‌ జోన్లలోని ప్రజలకు నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయించడానికి 19 కిరాణా దుకాణాలను ఏర్పాటు చేశామని, సహాయ విభాగం 1800 4250 8572 నెంబరును కేటాయించామన్నారు.

శ్రీకాళహస్తిలో మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో ఒకరు మహిళ. వీరు దిల్లీలోని ఓ మత కార్యక్రమానికి హాజరైన వ్యక్తుల సమీప బంధువులు. వీరికి గతంలో ఓసారి పరీక్షించగా.. కరోనా నెగెటివ్‌గా వచ్చింది. అయినా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి.. ఐదు రోజులకోసారి వారి స్వాబ్స్‌ నమూనాలు పరీక్షిస్తున్నారు. బుధవారం పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. వీరిని ఐసొలేషన్‌కు తరలించారు. ఇక తమిళనాడుకు చెందిన వ్యక్తి రాష్ట్ర సరిహద్దులు దాటి చిత్తూరుకు ఎలా చేరాడన్నది పోలీసులు తేల్చేపనిలో పడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా.. చెక్‌పోస్టులు దాటి, పోలీసుల కన్నుగప్పి ఇక్కడికి రావడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

ఇది చదవండి ఆసుపత్రిలో ఉద్యోగం మానేయ్యలేదని భార్యపై భర్త దాడి

Last Updated : May 1, 2020, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.