ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో చేసిన పని ఓ రైతుకు గుండెకోతను మిగిల్చింది. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం పాత గుడుపల్లికి చెందిన నరసింహులు అనే రైతు 15 ఎకరాల భూమిలో దానిమ్మ పంట సాగు చేస్తున్నాడు. ఓ వ్యక్తి పొగ తాగేందుకు ఉపయోగించిన అగ్గిపుల్లను పంటలో వేయటంతో డ్రిప్ పైపులు, టమోట కట్టెలు, దానిమ్మ మెుక్కలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే పంట పూర్తిగా కాలిపోయింది. దాదాపు 9 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం చొరవ తీసుకొని తనకు పరిహారం చెల్లించాలని కోరుతున్నాడు.
ఇదీ చదవండి: కరోనా ప్రభావం: రాహు, కేతు మండపాలు మూసివేత