ETV Bharat / state

చిత్తూరు అమరరాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - Chittoor Distric news

Amara Raja Battery Industry Fire accident: చిత్తూరు నగర శివారులోని మోర్దానపల్లెలోని అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని టీబీడీ ప్లాంటులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

chittor
అమర రాజా బ్యాటరీ పరిశ్రమ
author img

By

Published : Jan 30, 2023, 10:32 PM IST

Amara Raja Battery Industry Fire accident: చిత్తూరు నగర శివారులోని మోర్దానపల్లెలోని అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని టీబీడీ ప్లాంటులో అగ్ని కీలలు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు పరిశ్రమకు హూటాహుటిన రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

అమర రాజా పరిశ్రమ విషయానికొస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 37 సంవత్సరాలుగా ఈ పరిశ్రమల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ.. ఆటోమోటివ్ బ్యాటరీ వ్యాపారం, ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు, పానీయాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ వ్యవస్థ ఉత్పత్తి, షీట్ మెటల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అమరాన్ పేరుతో ఈ సంస్థ విక్రయిస్తున్న బ్యాటరీలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. ఇటీవలే దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం తెలంగాణ రాష్ట్రంలో లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.