ఇదీ చూడండి:
శ్రీవారిని దర్శించుకున్న ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్. కె. సింగ్
తిరుమల శ్రీవారిని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ ఎన్. కె. సింగ్ దర్శించుకున్నారు. వీరికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. విభజనానంతరం మన రాష్ట్రంలో ఉండే అవసరాల గురించి.. ఆర్థిక సంఘానికి విన్నవించామని మంత్రి తెలిపారు. వీటి గురించి చర్చించేందుకు ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ ఎన్. కె. సింగ్ ఇక్కడికు వచ్చారని అన్నారు.
ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ ఎన్. కె. సింగ్ తో పాటు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ,ఆలయ అధికారులు
ఇదీ చూడండి:
sample description