రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ –19 నియంత్రణకు చర్యలు వేగవంతం చేసిందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. జిల్లాలోని పలు క్వారంటైన్ కేంద్రాలకు ఉపముఖ్యమంత్రి... ఫ్యాన్లు అందజేశారు. కోవిడ్–19 నియంత్రణకు తమవంతు సాయంగా దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని పిలుపునిచ్చారు. క్వారంటైన్ సెంటర్లకు ఫ్యాన్లు అందించేందుకు ముందుకు వచ్చిన వివిధ సంఘాలు, సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. మద్యం నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని చెప్పారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తున్నామని.. ఇందుకోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి :